loader

అమెరికా యూనివర్సిటీలో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. ఒక్లహోమా(Oklahoma) స్టేట్ యూనివర్సిటీ (OSU) రెసిడెన్స్ హాల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరు OSU విద్యార్థి అని యూనివర్సిటీ పోలీసులు ధృవీకరించారు. ఘటన తర్వాత గాయపడిన వారందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు రెసిడెన్స్ హాల్‌కు తిరిగి వచ్చే సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

కౌర్, మంధాన పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో విజయంతో సెమీస్‌కు ఇంగ్లండ్

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ(650)లు అర్ధ శతకాలతో మెరిసినా జట్టును గట్టెక్కించలేకపోయారు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా నాలుగు విజయాలతో నాట్ సీవర్ బ్రంట్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. కానీ ఓ చిన్న రిక్వెస్ట్‌: రేణు దేశాయ్

రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..’ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి.  చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి’ […]

మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..

దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణు గోపాల్ , ఆశన్నలు వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని విప్లవ ద్రోహులుగా పేర్కొంది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుం డానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చ ని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని […]

జెఇఇ మెయిన్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2026 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో తొలి విడత జెఇఇ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది.జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు […]

విజయవాడ పున్నమిఘాట్‌ దీపావళి వేడుకల్లో సతీసమేతంగా సీఎం చంద్రబాబు

విజయవాడ పున్నమిఘాట్‌ దగ్గర దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. సొసైటీ ఫర్‌ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పున్నమి ఘాట్ లో ఏర్పాటుచేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్ని పిల్లలతో పాటు ఆనందంగా పంచుకున్నారు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. అంతకుముందు చంద్రబాబు చేతుల మీదుగా పున్నమి ఘాట్ లో ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. దీవాలి ఫైర్ క్రాకర్స్ పున్నమి ఘాట్ […]

దమ్ముంటే లై డిటెక్టర్‌ చేయండి : చంద్రబాబుకు మాజీ మంత్రి సవాల్‌

ఏపీలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే తనకు లై డిటెక్టర్‌ ( Lie detector) చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ సవాల్‌ చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎలాగైనా జైలులో ఉంచాలనే దురుద్దేశ్యంతో తనపై తప్పుడు కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న అద్దెపల్లి జనార్ధన్‌తో టీడీపీ కుమ్మకై వైసీపీ నాయకులపై కుట్రలు […]

ఏపీలో కళాకారులకు.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు!

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలను పరిరక్షించేందుకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కళారూపాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక, కళారంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలోనే కళాకారుల కృషిని గౌరవిస్తూ, వారికి అందరితోపాటు కాకుండా ప్రత్యేక పింఛన్ అందించే విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

కానిస్టేబుల్​ను చంపిన రియాజ్ ఎన్‌కౌంటర్! – క్లారిటీ ఇచ్చిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు, రౌడీ షీటర్ రియాజ్ హతం అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్‌లో ఎలాంటి ఎన్‌కౌంటర్ జరగలేదని, నిందితుడు రియాజ్‌పై ఎలాంటి కాల్పులు జరపలేదని తెలిపారు. ప్రస్తుతం అతడు ప్రాణాలతోనే ఉన్నాడని, తాము అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిజామాబాద్‌లో ఎలాంటి కాల్పులు జరగలేదని సీపీ స్పష్టం చేశారు.

28 లక్షల దీపాలతో ప్రకాశిస్తున్న రాముడి నగరం..

అయోధ్య నగరం ఈ దీపావళి వేళ చరిత్ర సృష్టించింది. భక్తుల సందడి, దీపాల కాంతి, సరయూ నదీ తీరంలోని ఆ భవ్య దృశ్యం ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా.. 9వ దీపోత్సవం కనుల పండువగా సాగింది. 56 ఘాట్‌లలో ఏకంగా 26 లక్ష 11 వేల 101 దీపాలను వెలిగించారు. 2 వేల వంద మందితో సరయూ నదీ తీరాన మహా హారతి నిర్వహించారు. 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON