దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లకు సంబంధించి మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణు గోపాల్ , ఆశన్నలు వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని విప్లవ ద్రోహులుగా పేర్కొంది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుం డానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపించింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. ప్రాణభీతి ఉన్నవారెవరైనా లొంగిపోవచ్చ ని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని కోరింది.

