loader

మోదీ చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే.. రేవంత్‌ త్వరగా అమలు చేస్తడు : కేటీఆర్‌

ేంద్రంలోని మోదీ సర్కారు తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే త్వరగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బడే భాయ్‌ కోసం రేవంత్‌ రెడ్డి చేసిన పని ఇదేనని.. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్‌-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు వంద గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని.. తులం బంగారం ఇస్తాం.. యువతులకు రూ.2500 ఇస్తాం.. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామని […]

కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్

ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తెలంగాణ పోలీసులు రౌడీషీటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ను పోలీసులు బైండోవర్‌ చేశారు. మరో వంద మంది రౌడీ షీటర్లను సైతం బైండోవర్‌ చేశారు. మధురా నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది, బోరబండ పీఎస్‌ పరిదిలో 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ […]

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులు.. బీఆర్ఎస్‌లో గుబులు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోడ్‌ రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులు ఓటర్లను అయోమయానికి గురిచేసే అవకాశం ఉందని గులాబీ నేతలు కంగారు పడుతున్నారు.  ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతి మేకర్, క్యాప్ వంటి గుర్తులు కారు గుర్తును అచ్చం పోలి ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.

బిహార్​లో NDA, జన్ సురాజ్ పార్టీ మధ్యే పోటీ- ప్రశాంత్ కిశోర్ జోస్యం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బిహార్ శాసనసభ ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్​డీఏ), జన్ సురాజ్ పార్టీ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహాగఠ్ బంధన్ మూడో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తేజస్వీ ఇలాంటి అర్థం లేని హామీలను ఇచ్చి ఎన్నికల రేసులలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ తేజస్వీ వాగ్దానాల పట్ల శ్రద్ధ చూపడం లేదు.” అని ప్రశాంత్ […]

నకిలీ మద్యం కేసులో ఆరోపణలు నిరూపిస్తేదుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా: జోగి రమేష్

నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదంటూ విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటానన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులతో వచ్చి దుర్గ గుడిలో ప్రమాణం చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉందని నిరూపించాలని చంద్రబాబు, లోకేష్ కు గతంలోనే జోగి రమేష్ విసిరారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ […]

వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వీ యాదవ్

రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పారేస్తాం అంటూ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఆదివారం సంచలనం సృష్టించారు. ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో వరుస ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్ పాలన ఆగిపోయిన నీటిలా మారిపోయి.. ఇప్పుడు మురుగు వాసన వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేశినేని చిన్ని పై స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, టీవీలో మాత్రమే చూశానని నాని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, కేశినేని చిన్ని అంటే కూడా భయం లేదని, కేశినేని చిన్ని పరిస్థితి చూస్తే గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఎఫెక్ట్ కనిపిస్తోందని విమర్శించారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదని, చిన్నితో పాటు ప్రభుత్వ పెద్దల పతనం […]

ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిల మోత..

కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా అని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడటం లేదని.. వాళ్లు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని విమర్శించారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు […]

తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై కసరత్తు!

తెలంగాణలో డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ లో కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కూడా హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం, స్థానిక డీసీసీలను సమర్ధవంతంగా నియమించడం ముఖ్య అంశాలుగా చర్చించబడ్డాయి.

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 30 కి వాయిదా

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ ఢిల్లీకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) నుంచి కొన్ని వివరణలు కావలసి ఉన్నందున విచారణ వాయిదా వేసినట్టు స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే శనివారం వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2000 కోట్ల విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాదీనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆరోపిస్తూ ఈడీ ఛార్జిషీటు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON