ేంద్రంలోని మోదీ సర్కారు తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే త్వరగా తెలంగాణలో రేవంత్రెడ్డి అమలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని ఇదేనని..
ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు వంద గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని.. తులం బంగారం ఇస్తాం.. యువతులకు రూ.2500 ఇస్తాం.. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు.

