loader

గన్నవరం నుంచి బయలుదేరే పలు విమానాలు రద్దు

విజయవాడ నగరంలో రేపు అంటే మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేర వలసిన వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షార్జా వెళ్లి వచ్చే 8 సర్వీసులను రద్దు చేసినట్లు వివరించారు. రేపు ఉదయం 10:00 గంటల తర్వాత ఇండిగో విమానం సర్వీసులను సైతం నిలిపివేసే అవకాశం ఉందన్నారు. అయితే ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం సర్వీసు మాత్రం యథావిధిగా నడుస్తుందని స్పష్టం చేశారు.

భక్తి శ్రద్ధలతో ఛత్ పూజ

ఛత్ మహా పర్వంలో మూడవ, అత్యంత ముఖ్యమైన రోజు అయిన ‘సంధ్యా అర్ఘ్యం’ ఘనంగా జరిగింది. మహిళా భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు, దీర్ఘాయుష్షు కోసం భువనేశ్వర్‌లోని కువాఖై నది మరియు పాట్నా ఘాట్‌ల వంటి నదీ తీరాలలో మరియు చెరువుల వద్దకు చేరుకుని అస్తమించే సూర్యుడికి ప్రత్యేక పూజలు, ‘అర్ఘ్యం’ సమర్పించారు.

‘ఈ భూమి మీదే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు’..

బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్‌లోని వర్తూర్ మెయిన్ రోడ్డు పరిస్థితిని వివరిస్తూ మాజీ జర్నలిస్ట్ జైషా అమ్లాని ఈ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన రోడ్డుపైకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఒక గుంత ఏకంగా 117 అంగుళాల పొడవు, 56 అంగుళాల వెడల్పు ఉందని టేపు సాయంతో కొలతలు వేసి మరీ లెక్కించారు. ఇక ఆ వీడియో తీస్తున్న సమయంలో తాను ప్రమాదవశాత్తు కిందపడటంతో మోకాలికి గాయం కూడా అయిందని చెప్పారు.

రెండో విడత ‘SIR‌’.. వెల్లడించిన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌

ేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ‘SIR‌’ అంశంపై కీలక ప్రకటన చేసింది. రెండో దశలో అండమాన్ అండ్‌ నికోబార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో దశలో 51 కోట్లమంది ఓటర్లు SIR కార్యక్రమంలో భాగమవుతారని.. నవంబర్‌ 4 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. డిసెంబర్‌ 9న ముసాయిదా, తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు సీఈసీ […]

AI చిత్రాలతో బ్లాక్‌ మెయిల్.. 19 ఏళ్ల ఇంటర్ స్టూడెంట్‌ ఆత్మహత్య

గత కొన్ని రోజుల క్రితం ఒక నిందితుడు,హర్యానాకు చెందిన 19 ఏళ్ల కాలేజ్‌ స్టూడెంట్‌ రాహుల్‌ ఫోన్‌ను హ్యాక్ చేసి అతనితో పాటు, అతని ముగ్గురి సోరిమణుల చిత్రాలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలుగా చిత్రీకరించాడు. వాటిని రాహుల్‌కు పంపి రూ.20,000 వేలు ఇవ్వకపోతే ఈ చిత్రాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]

మోదీ చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే.. రేవంత్‌ త్వరగా అమలు చేస్తడు : కేటీఆర్‌

ేంద్రంలోని మోదీ సర్కారు తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే త్వరగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బడే భాయ్‌ కోసం రేవంత్‌ రెడ్డి చేసిన పని ఇదేనని.. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్‌-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు వంద గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని.. తులం బంగారం ఇస్తాం.. యువతులకు రూ.2500 ఇస్తాం.. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్‌ ఇస్తామని […]

ఒక్కో కుటుంబానికి రూ.3000, 25 కేజీల బియ్యం… సీఎం

మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్‌చార్జ్‌లను నియమించాలి అని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలని, ‘తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి.ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే’అని సీఎం […]

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి..డిప్యూటీ సీఎం

మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు షాక్

ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తెలంగాణ పోలీసులు రౌడీషీటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ను పోలీసులు బైండోవర్‌ చేశారు. మరో వంద మంది రౌడీ షీటర్లను సైతం బైండోవర్‌ చేశారు. మధురా నగర్ పీఎస్‌లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా 19 మంది, బోరబండ పీఎస్‌ పరిదిలో 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ […]

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులు.. బీఆర్ఎస్‌లో గుబులు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోడ్‌ రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులు ఓటర్లను అయోమయానికి గురిచేసే అవకాశం ఉందని గులాబీ నేతలు కంగారు పడుతున్నారు.  ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతి మేకర్, క్యాప్ వంటి గుర్తులు కారు గుర్తును అచ్చం పోలి ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON