గత కొన్ని రోజుల క్రితం ఒక నిందితుడు,హర్యానాకు చెందిన 19 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్ రాహుల్ ఫోన్‌ను హ్యాక్ చేసి అతనితో పాటు, అతని ముగ్గురి సోరిమణుల చిత్రాలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలుగా చిత్రీకరించాడు. వాటిని రాహుల్‌కు పంపి రూ.20,000 వేలు ఇవ్వకపోతే ఈ చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

