జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్‌పై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రోడ్ రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులు ఓటర్లను అయోమయానికి గురిచేసే అవకాశం ఉందని గులాబీ నేతలు కంగారు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతి మేకర్, క్యాప్ వంటి గుర్తులు కారు గుర్తును అచ్చం పోలి ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడుతుందని బీఆర్ఎస్ అనుమానిస్తోంది.

