బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బిహార్ శాసనసభ ఎన్నికల్లో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), జన్ సురాజ్ పార్టీ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహాగఠ్ బంధన్ మూడో స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. తేజస్వీ ఇలాంటి అర్థం లేని హామీలను ఇచ్చి ఎన్నికల రేసులలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ తేజస్వీ వాగ్దానాల పట్ల శ్రద్ధ చూపడం లేదు.” అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.

