loader

విజయవాడ నుంచి సింగపూర్‌కు కేవలం 4 గంటల్లోనే..

ఇండిగో సంస్థ విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసు కోసం నవంబర్ 15 రోజు ప్రయాణానికి బుకింగ్‌లను ప్రారంభించింది. సింగపూర్ – విజయవాడ ఇండిగో విమానం సింగపూర్ నుంచి ఉదయం 7:45 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. అలాగే విజయవాడ నుంచి సింగపూర్‌కు ఉదయం 10:05 గంటలకు బయల్దేరుతుంది. వారంలో మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే విజయవాడ సింగపూర్ ఇండిగో విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి సింగపూర్ విమాన టికెట్ ధర రూ. 9,239గా ఉంది.

పార్టీ పరంగా రిజర్వేషన్‌లకు ఒప్పుకోం : ఆర్.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసి జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్‌ల అమలుకు అంగీకరించ బోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరో రెండు నెలలు వాయిదా పడితే ఏమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగేళ్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమాలు చేస్తామని కృష్ణయ్య […]

ఇంటలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు..

కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ (ACIO) గ్రేడ్‌ 2 టెక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 258 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో CSE & IT పోస్టులు 90, ECE పోస్టులు 168 వరకు ఉన్నాయి. అభ్యర్థులు ఎవరైనా నవంబర్‌ 11 , 2025వ తేదీలోపు […]

ఏపీలో మొంథా తుఫాన్ అలర్ట్ సైరన్..

రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను వేగంగా పయనిస్తూ, ఏపీలోని తీర జిల్లాలకు ముప్పుగా మారబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలి, మరికొన్ని గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 770 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో […]

ప్రైవేట్ ట్రావెల్స్​పై రవాణా శాఖ కొరడా – 361 బస్సులపై కేసులు, 40 సీజ్

కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ ఆర్టీఏ తనిఖీలు విస్తృతం చేశారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించి 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో 40 బస్సులను సీజ్‌ చేశారు. నంద్యాల జిల్లాలో 66, ఎన్టీఆర్ జిల్లాలో 42, పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34, తిరుపతి జిల్లాలో 25, అన్నమయ్య జిల్లాలో 21, కర్నూలు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 8, ట్రావెల్స్ బస్సులపై […]

రష్యా బూరెవెస్ట్‌నిక్‌ క్షిపణి పరీక్ష – అమెరికాకు మరో హెచ్చరిక!

రష్యా ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ప్రకారం, రష్యా సైన్యం తాజాగా ‘బూరెవెస్ట్‌నిక్‌’ (Burevestnik) అనే సరికొత్త అణు శక్తితో నడిచే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సుదీర్ఘ దూరాలపై దాడి చేసే సామర్థ్యం కలిగి ఉందని, అణు ఇంధనంతో నడుస్తుందని రష్యా వెల్లడించింది. ఈ క్షిపణి 15 గంటలపాటు గాల్లోనే ఉండి, దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ ప్రదర్శన అమెరికా మరియు నాటో దేశాలకు స్పష్టమైన […]

హిట్‌మ్యాన్ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన సిడ్నీకి వీడ్కోలు పలికాడు. దీనికి సంబంధించిన ఫొటోను హిట్‌మ్యాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘చివరిసారిగా సిడ్నీ నగరానికి వీడ్కోలు పలుకుతున్నాను’ అంటూ క్యాప్షన్‌తో గుడ్ బై చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్.. సిడ్నీ కింగ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మస్కట్‌లో సిరిసిల్ల యువకుడి నరకయాతన..సెల్ఫీ వీడియో

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ్గళ్ళపల్లి మండలం బస్వాపూర్ చెందిన సతీష్‌ అనే యువకుడు మస్కట్‌లో పీకల్లోతు సమస్యల్లో చిక్కుకున్నాడు. తినడానికి సరైన ఆహారంలేక, రోజులు గడవడం కూడా కష్టంగా మారింది. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోవాలా..? అని ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న సతీష్‌ చివరకు తన బాధను సెల్ఫీ వీడియో రూపంలో బయటపెట్టాడు. ఈ వీడియోలో సతీష్‌ తన గోడునంత వెల్లగక్కాడు. నన్ను భారత్‌కు తీసుకెళ్లండి. ‘మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్లాలనుంది‘ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

కేశినేని చిన్ని పై స్ట్రాంగ్ కౌంటర్

టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో తాను ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదని, టీవీలో మాత్రమే చూశానని నాని స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, కేశినేని చిన్ని అంటే కూడా భయం లేదని, కేశినేని చిన్ని పరిస్థితి చూస్తే గొడుగుపేట వెంకటేశ్వరస్వామి ఎఫెక్ట్ కనిపిస్తోందని విమర్శించారు. గొడుగుపేట వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా పతనం తప్పదని, చిన్నితో పాటు ప్రభుత్వ పెద్దల పతనం […]

మైనార్టీ గురుకులాల్లో చదివిన ఎంబీబీఎస్‌ విద్యార్థులను సన్మానించిన కేటీఆర్‌, హరీశ్‌రావు

జహీరాబాద్ లోని (TMREIS) తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్‌లో సీటు పొందిన విద్యార్థులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. ఎంబీబీఎస్ సీట్ సాధించిన మైనార్టీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను కేటీఆర్ , హరీశ్‌ రావు శాలువతో సత్కరించి సన్మానించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ అని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON