loader

డిప్యూటీ సీఎం వదినకు..నగరం నడిబొడ్డున కోట్లు విలువ చేసే సర్కారు జాగ..

ఖరీదైన ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం కుటుంబానికి కట్టబెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. హైదర్‌గూడ ప్రాంతంలోని ప్రముఖ కేఫ్ బహార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి అధికారులు తీర్మానం (Resolution No. 253) చేశారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య డాక్టర్ మల్లు రాజా బన్సీదేవి పేరిట ఈ స్థలాన్ని కేటాయించడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వదినకు భారీ విలువైన […]

ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన కేటీఆర్

ఉప్పల్ నియోజకవర్గపరిధిలోని ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేయూత అందించారు. 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికసాయం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కులను బుధవారం నాడు లక్ష్మారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డిని కేటీఆర్ అభినందించారు. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు చెక్కులు అందజేయడం నిజంగా అభినందనీయమని ప్రశంసించారు

ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులపై పెట్టిన కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు.

రాహుల్ వికారాబాద్ పర్యటన.. కవిత ఘాటు విమర్శలు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” (రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి) అంటూ ఎక్స్ (X) వేదికగా సూటిగా ప్రశ్నించారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా?” ఉద్యోగాలు అడిగితే పోలీసులతో […]

మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ..ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మోసం చేయడంలో డీఎంకే మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. తమిళనాడు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారని, డీఎంకే ప్రభుత్వం తమిళనాడును దోచుకుంటోందని  రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తామని మధురై బహిరంగ సభలో ప్రధాని హామీ ఇచ్చారు.

విజయ్‏కు మరో ఎదురుదెబ్బ…కొడుకు సంచలన నిర్ణయం..

విజయ్ దళపతికి తనయుడు జాసన్ సైతం తన తండ్రికి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు తన తల్లి విడాకులు కోరడంతో జాసన్ తన తండ్రి విజయ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాసన్ ఫాలోయింగ్ లిస్టులో విజయ్ దళపతి పేరు లేకపోవడంతో అదే స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే జాసన్ తన తండ్రిని అన్ ఫాలో చేయడం నిజమా కాదా […]

మా అన్న కుటుంబాన్ని నాశనం చేశావ్.. త్రిషపై ట్రోలింగ్!

హీరో దళపతి విజయ్‌తో మరో నటికి సంబంధం ఉందంటూ ఆయన భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేశారు. దీంతో ఆ నటి త్రిషనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. విజయ్‌తో పాటు వినిపిస్తున్న త్రిష పేరే ఇప్పుడు కూడా బలంగా ప్రచారంలో ఉంది. దీంతో   త్రిషపై సోషల్ మీడియాలో తీవ్రమైన సైబర్ దాడి జరుగుతోంది. ఆమె పాత సోషల్ మీడియా పోస్టుల కింద దారుణమైన కామెంట్లు కనిపిస్తున్నాయి

ఢిల్లీ ఎన్నికలు జరపండి.. బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లొస్తే రాజకీయాలు వదిలేస్తా : కేజ్రీవాల్

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సత్తా ఉంటే తక్షణం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీని బీజేపీ నాశనం చేసింది. ఇక్కడ అధికారం చేపట్టాలనే ఆశతో మూడు కోట్ల ఢిల్లీ ప్రజల్ని ఇబ్బందుల్లో నెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని  తొలగించేందుకు దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుట్రకు బీజేపీ తెరలేపింది. […]

వైవీ సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తిని నేనే: బాలినేని

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలో వైవీ సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని.. మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని […]

డీఎంకే తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన, ఊహించని అధ్యాయం మొదలైంది. దివంగత జయలలితకు నమ్మిన బంటుగా, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) శుక్రవారం అధికార డీఎంకే పార్టీలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తన మద్దతుదారులతో కలిసి వచ్చిన ఓపీఎస్‌కు స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON