ఖరీదైన ప్రభుత్వ భూమిని డిప్యూటీ సీఎం కుటుంబానికి కట్టబెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. హైదర్‌గూడ ప్రాంతంలోని ప్రముఖ కేఫ్ బహార్ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి అధికారులు తీర్మానం (Resolution No. 253) చేశారు. నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య డాక్టర్ మల్లు రాజా బన్సీదేవి పేరిట ఈ స్థలాన్ని కేటాయించడానికి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వదినకు భారీ విలువైన భూమిని ధారాదత్తం చేయడం విమర్శలకు తావిస్తోంది.

