loader

ఇరాన్ ఆపద్ధర్మ నేతగా అయతుల్లా రెజా

ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి.

విండీస్ పై గెలుపు… సెమీ ఫైనల్ కు భారత్

టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య  జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.

గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నివసిస్తున్న ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఏపీ ఎన్నార్టీ (APNRTS) ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 85000 27678 ను అందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ apnrts.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలోని ఏపీ పౌరులందరూ  తమ వివరాలను ఇండియన్ ఎంబసీలో నమోదు […]

దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయం లోపలి భాగంలో కొంత నిర్మాణానికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన కారణంగా నలుగురు విమానాశ్రయ ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. దుబాయ్ నగరానికి చిహ్నంగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఏడు నక్షత్రాల హోటల్ ‘బుర్జ్-అల్-అరబ్’పై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఆకాశంలోనే డ్రోన్లను కూల్చివేసినా, వాటి శిథిలాలు పడటంతో […]

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం.. ప్రసూతి, పిల్లల వార్డులో మంటలు..

నెల్లూరు జీజీహెచ్‌లోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డులో ఆదివారం మంటలు చెలరేగాయి. పిల్లల వార్డులో మంటలు చెలరేగటంతో ఆందోళన వ్యక్తమైంది. మంటలు, పొగ విస్తరించటంతో వార్డులోని గర్భిణులు, బాలింతలు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ వార్డులలో విస్తరించటంతో ఆస్పత్రిలోని రోగులు, పసి పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రోగులను సురక్షితంగా ఆస్పత్రి వెలుపలికి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అమరావతిలో ప్రభుత్వం, రైతులు చూపిన చొరవ మధ్యవర్తిత్వ విజయమే: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

విజయవాడలో జరిగిన ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదని, ఓ ప్రాధాన్యాంశమని విజయవాడలో జరిగిన ‘మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు’లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. మధ్యవర్తిత్వం భారతీయలు డీఎన్‌ఏలోనే ఉందని ఉదహరించారు. రెండు పక్షాలకు మేలు చేకూర్చేలా చేయడంలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టులపై కేసుల భారం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని విస్మరించడం ఏ మాత్రం సహేతుకం కాదన్నారు.

ఖమ్మం అంబేడ్కర్ భవన్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవన్ వద్ద ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులు లేదా ఆక్రమణల తొలగింపు చర్యల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు నినదించారు. నిరసనకారులను రోడ్డుపై నుంచి పంపించే క్రమంలో తమను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని, తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! ఇకపై సిమ్‌ బైండింగ్‌ తప్పనిసరి

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ భద్రతను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తోంది. మార్చి 1 నుండి ప్రభుత్వం కొత్త సిమ్-బైండింగ్ నియమాన్ని అమలు చేస్తోంది. మీరు మీ వాట్సాప్ ఖాతాను మీ ప్రధాన ఫోన్‌లోని భౌతిక సిమ్ కార్డ్‌తో ముడిపడి ఉంచాలి.  సిమ్ బైండింగ్‌తో, మీ సిమ్ ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్‌లో ఉందో లేదో చూడటానికి వాట్సాప్ ప్రతి ఆరు గంటలకు తనిఖీ చేస్తుంది. దాన్ని తీయండి దానిని మార్చుకోండి లేదా నిష్క్రియం చేయండి, మీరు మళ్ళీ […]

ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

వ్యాపార, విద్య, ఆధ్యాత్మికత, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పుదుచ్చేరిని మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు . పుదుచ్చేరిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి పుదుచ్చేరి ఒక ఉదాహరణ అని అన్నారు. భారతదేశం అంతటా ఉన్నత-నాణ్యత మౌలిక సదుపాయాలను సృష్టించడానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నామని, రాష్ట్రాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక మూలధన పెట్టుబడి నిధిని […]

మోసం చేయడంలో డీఎంకే మంత్రుల మధ్య పోటీ..ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లు, తమిళనాడులో రూ. 4,400 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మోసం చేయడంలో డీఎంకే మంత్రులు పోటీ పడుతున్నారన్నారు. తమిళనాడు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారని, డీఎంకే ప్రభుత్వం తమిళనాడును దోచుకుంటోందని  రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తామని మధురై బహిరంగ సభలో ప్రధాని హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON