నెల్లూరు జీజీహెచ్‌లోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డులో ఆదివారం మంటలు చెలరేగాయి. పిల్లల వార్డులో మంటలు చెలరేగటంతో ఆందోళన వ్యక్తమైంది. మంటలు, పొగ విస్తరించటంతో వార్డులోని గర్భిణులు, బాలింతలు భయంతో పరుగులు తీశారు. దట్టమైన పొగ వార్డులలో విస్తరించటంతో ఆస్పత్రిలోని రోగులు, పసి పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రోగులను సురక్షితంగా ఆస్పత్రి వెలుపలికి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

