loader

అక్షయ తృతీయ

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది .

తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా చిత్తరంజన్ ను నియమించారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీగా చైతన్య రెడ్డి, జగిత్యాల అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా పండరీ చేతన్, మెదక్ జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) గా విక్రాంత్ కుమార్ సింగ్, నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్, వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా రాజేశ్ మీనా, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా మౌనిక, నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీగా […]

ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపించారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ కి సడెన్ గా శస్త్ర చికిత్స..అభిమానుల్లో ఆందోళన

ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. పవన్ అభిమానులకు ఇది ఆందోళన కలిగించే వార్తే అని చెప్పాలి. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే తర్వాత దీర్ఘకాలం పాటు పవన్ జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ మునుపటిలా యాక్టివ్ గా రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేయగలరా అనే చర్చ మొదలైంది.

స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్… 500 మందికి షాక్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి దశలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. సంస్థలో ప్రస్తుతం దాదాపు 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  గతంలో సంస్థ వద్ద సుమారు 50 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 13 విమానాలు మాత్రమే ఉన్నాయి.

కాంగ్రెస్‌ విధానాలతో దేశానికి తీవ్రనష్టం: మోదీ

కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ పార్టీ చేసేవన్నీ ప్రతికూల రాజకీయాలని మండిపడ్డారు. ‘‘జన్‌ధన్‌, డిజిటల్‌ పేమెంట్స్‌, జీఎస్టీ, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దులను కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ఏ సంస్కరణ వచ్చినా ఆ పార్టీ అడ్డుకుంటుంది.. దుష్ప్రచారం చేస్తుంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. హస్తం పార్టీ విధానాల వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోంది’’ అని అన్నారు.

మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం – విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోయిన సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడు మహిళల పురోగతి ఎలా నిలిచిపోయిందో చూస్తున్నారు… మా శతవిధ ప్రయత్నాల పట్టికీ, మేము విజయం సాధించలేకపోయామని ఆయన తెలిపారు. నారీ శక్తి అధినియంలో సవరణలు చేయలేకపోయాము. దీనికి గాను దేశంలోని తల్లులందరికీ, సోదరీమణులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నానని మోదీతెలిపారు.మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి పేరున్న ఐపీఎల్ టికెట్లు హీరోయిన్లకు.. సీఎంవోపై అనుమానాలు.

తెలంగాణ ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంజ్ టిక్కెట్లతో హీరోయిన్ కుషితా కల్లాపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వెళ్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సీఎం పేరు మీదున్న టిక్కెట్ ఫోటోలను పెట్టడంతో ఈ విషయం బయటపడింది. దాంతో, సీఎంవో టిక్కెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా? లేదంటే బ్లాక్‌లో అమ్ముతున్నారా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలైట్ లాంజ్ టిక్కెట్ల విలువ రూ. 40,000లు ఉంటుంది. ఇంత ఖరీదైన టికెట్లను ఉచితంగా హీరోయిన్లకు పంచుతున్నది ఎవరు? […]

పంచాయతీ కార్యాలయం ముందు మహిళా సర్పంచ్ నిరసన

మెదక్ జిల్లా  పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహిళా సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్ శనివారం నాడు నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్ రాజుగౌడ్ పదేపదే అవమానిస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగంరేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీకి తెలియకుండా ప్రతి వీధిలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్ల కలెక్షన్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON