మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మహిళా సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్ శనివారం నాడు నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్ రాజుగౌడ్ పదేపదే అవమానిస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగంరేణుక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీకి తెలియకుండా ప్రతి వీధిలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్ల కలెక్షన్లు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

