నటుడు ప్రకాశ్‌రాజ్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ నోటీసులను పంపించారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.

