ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి దశలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. సంస్థలో ప్రస్తుతం దాదాపు 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో సంస్థ వద్ద సుమారు 50 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 13 విమానాలు మాత్రమే ఉన్నాయి.

