loader

మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్.. నా బెస్ట్ ఇచ్చాను.. పవన్ కళ్యాణ్

సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. క్రిష్ చాలా మంచి కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. సినిమా కోసం నిర్మాత ఎంతో నలిగిపోయారు. ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పోశారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేసాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను. నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను అని […]

AP FDC ఛైర్మెన్‌ పదవికి ఏ.ఎం. రత్నం పేరు సిఫార్సు చేసిన పవన్ కళ్యాణ్

ఒక మేకప్‌ మ్యాన్‌గా కెరీర్ మొదలుపెట్టి, నిర్మాతగా, దర్శకుడిగా మారిన ఏ. ఎం. రత్నంగారికి నా బెస్ట్ ఇవ్వాలని కష్టపడ్డాను. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్‌ పదవికి ఏ. ఎం. రత్నం పేరుని నేనే ప్రతిపాదించాను. నా సినిమా నిర్మాత అని కాదు. ఆయన తెలుగులో చాలామంది హీరోలతో సినిమాలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. ఇలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది.. అంటూ చెప్పుకొచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

కేవలం వారానికే.. రెమ్యునరేషన్‌లో అమితాబ్‌ బచ్చన్‌ టాప్‌

ఇండియాలో సూపర్ పాపులర్‌ టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది కౌన్‌ బరేగా కరోడ్‌పతి 17వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌ బీ కేవలం వారానికి ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. వారంలో ఐదు ఎపిసోడ్స్‌కుగాను ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్టు  మీడియాలో ఓ కథనం ,అన్ని సీజన్లను హోస్ట్‌గా కనిపిస్తున్న లెజెండరీ యాక్టర్‌ బిగ్‌ బీకి రూ.25 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వడం ఆయనకు స్థాయికి తగిన గుర్తింపునివ్వడమని […]

షారుక్ ఖాన్‌కు గాయాలు.. హుటాహుటిన అమెరికా తరలింపు

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ ఖాన్‌ గాయపడ్డారు. ఆయన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌’ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు సమాచారం. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను అమెరికాకు తరలించారని తెలుస్తోంది. ఈ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కంగారు ప‌డాల్సింది ఏమి లేద‌ని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గ‌తంలో కండ‌రాల స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ్డ షారూఖ్ ఖాన్ అప్పుడు చికిత్స తీసుకున్నారు.

పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫొటో.. షాకిచ్చిన డెయిరీ యజమాని

ఎయిరిండియా, ఇండిగో విమానాల మీద.. బస్సులు, ఆటోల మీద.. దుబాయిలోని బుర్జ్ ఖలీఫా మీద, కూల్ డ్రింగ్స్, వాటర్ బాటిల్స్ పై వీరమల్లు పోస్టర్లు ముద్రించినట్టుగా కొన్ని ఫోటోలు ఎక్స్ లో దర్శనమిస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ మూవీ ప్రమోషన్స్ కోసం పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదని విజయ పాల డెయిరీ ఎండీ ఈశ్వర్ బాబు స్పష్టం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్! వీక్షించిన రాష్ట్రపతి, మంత్రులు

రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు ఈ సినిమాని వీక్షించారు. కన్నప్ప చిత్ర యూనిట్, ఈ విషయంపై స్పందించింది. ‘ఇది మాటలకందని గౌరవం. రాష్ట్రపతి భవన్‌లో కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దైవభక్తితో నిండిన కథనానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు దక్కిన గౌరవం ఇది.. హర్ హర్ మహదేవ్..’ అంటూ ట్వీట్ చేసింది కన్నప్ప చిత్ర యూనిట్..

నెలకు 40 లక్షలు భరణంగా ఇవ్వాలి- జయం రవి మాజీ భార్య

హీరో జయం రవికి తన డిమాండ్‌తో షాకిచ్చింది మాజీ భార్య ఆర్తి, తనకు నెలకు 40లక్షలు భరణంగా కావాలని ఆర్తి అడగడంతో.. షాకయ్యారట హీరో రవి. తన ఎక్స్‌ వైఫ్‌ ఆర్తికి అంత ఇచ్చుకోలేనంటూ చెప్పారట. సంవత్సరంలో తాను సంపాదించే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఆర్తి డిమాండ్ చేస్తుందని.. కావాలనే తనను ఇబ్బందిపెట్టాలనే ఆర్తి ఇలా ప్రవర్తింస్తుందంటూ చెబుతున్నారు. విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్య ఎంత పడితే అంత భరణంగా పొందే అవకాశం […]

సీనియర్ నటి బీ సరోజాదేవి కన్నుమూత

ప్రముఖ సీనియర్‌ నటి బి. సరోజాదేవి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజా దేవికి  మణిపాల్ ఆస్పత్రిలో  చికిత్స అందించారు. అనంతరం బెంగళూరులోని ఆమె నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సరోజా దేవి తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజ నటులతో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. సరోజాదేవి దాదాపు 200 సినిమాలలో నటించారు. నటి బీ సరోజా దేవి మృతిపట్ల పలువురు […]

ముగిసిన ‘కోట’ అంత్యక్రియలు

సినీ ప్రముఖులు, అభిమానులు, కళాకారులు, కుటుంబ సభ్యుల అశ్రు నయనాల మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకు ముందు ఫిల్మ్‌నగర్‌లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఇందులో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు పాల్గొని కోటకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON