సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. నా జీవితంలో సినిమాపరంగా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి. క్రిష్ చాలా మంచి కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. సినిమా కోసం నిర్మాత ఎంతో నలిగిపోయారు. ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పోశారు. మండుటెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేసాం. చాలా కాలం తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాను. నిర్మాత కనుమరుగు కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను అని అన్నారు.

