ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ అందుబాటులో ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆదివారం నాటికే రాష్ట్రంలో 420కి పైగా పెట్రోల్ బంకులు మూతపడగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.
సాధారణం కంటే సరఫరా పెంచినా అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొట్టించడంతో కొరత ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

