బంతి బంతికి మలుపు.. సూపర్ ఓవర్‌లో గట్టెక్కిన కలకత్తా నైట్‌రైడర్స్
ఐపీఎల్ 2026లో ఆదివారం సాయంత్రం జరిగిన కలకత్తా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జియాంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రేక్షకులను నేల మీద ఉండేలా చేయలేదు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో.. బంతి బంతికి ఫలితం తారుమారుతున్న వేళ కలకత్తా నైట్‌రైడర్స్ అద్భుతం చేసింది. ఈ సీజన్‌లో సూపర్ ఓవర్‌కు మరలిన ఈ మ్యాచ్‌లో కలకత్తా అద్భుత విజయం సొంతం చేసుకుంది. తక్కువ స్కోర్‌ను బాదినా కాపాడుకునేందుకు కలకత్తా.. గెలిచేందుకు లక్నో తీవ్రంగా పోరాడాయి

