ఆటో డ్రైవర్ తన కుమారుడికి అప్పులు చేసి మరీ కొత్త మోటార్ సైకిల్‌ను కొనిచ్చారు. బైక్ చేతికి వచ్చిన తర్వాత జల్సాలకు అలవాటు పడ్డాడు. కాలేజీకి వెళ్లడం కంటే స్నేహితులతో బలాదూర్ తిరుగుతూ అతివేగంగా వెళ్తూ ఒక ప్రమాదానికి గురయ్యాడు. తండ్రి ఆసుపత్రులకు దాదాపు లక్ష రూపాయల వరకు వెచ్చించారు. అతివేగం, హెల్మెట్ లేకపోవడం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడంతో నిరంతరం ట్రాఫిక్ చలానాలు వచ్చేవి.
బైక్ ఉన్నంత కాలం నా కొడుకు పద్ధతి మారదు అనే ఆవేశం, ఆవేదనతో బైక్ పెట్రోల్ పోసి నిప్పంటించారు

