తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కూడా ఇంధన లభ్యతపై భయాందోళనలు చోటుచేసుకుంటున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని పలుచోట్ల పెట్రోల్ బంక్ల ఎదుట నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంక్ల ఎదుట బారులు తీరి కనిపిస్తున్నారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రస్తుతానికి అధికారికంగా డీజిల్ లేదా పెట్రోల్ కు సంబంధించి ఎటువంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది.

