రాష్ట్రపతి భవన్లో ‘కన్నప్ప’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు ఈ సినిమాని వీక్షించారు. కన్నప్ప చిత్ర యూనిట్, ఈ విషయంపై స్పందించింది. ‘ఇది మాటలకందని గౌరవం. రాష్ట్రపతి భవన్లో కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దైవభక్తితో నిండిన కథనానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు దక్కిన గౌరవం ఇది.. హర్ హర్ మహదేవ్..’ అంటూ ట్వీట్ చేసింది కన్నప్ప చిత్ర యూనిట్..

