‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు ముందు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ ఎఎం రత్నంపై కంప్లైంట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. నైజాం ఏరియాకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. అంతకు ముందు సినిమాలకు సంబంధించి ఒప్పందం ప్రకారం మనీ రీఫండ్ చేయాలని… లేకుంటే నైజాం ఏరియాలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కష్టమే అంటూ లేఖలో పేర్కొన్నారు.

