loader

తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026 – విజేతలకు పురస్కారాలు

ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్ ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డ్, సహజ నటి జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వరించింది.

ఉగాది వేళ మెగాస్టార్ చిరంజీవి మరో సంచలన నిర్ణయం

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగవేళ మెగాస్టార్ చిరంజీవి ఉగాది పర్వదినాన మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో పేద పిలల్లకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా అడుగులు వేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ నిర్ణయంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడమే తన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తమిళ నటుడు సూర్య స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.

అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వివాహానికి సంబంధించి గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి Team Anushka ముగింపు పలికింది. వివాహం అనేది ఒకరి వ్యక్తిగత విషయమని, అది బ్రేకింగ్ న్యూస్ లేదా ట్రెండ్ కాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా అనుష్క వయసును (44 ఏళ్లు) ప్రతి వార్తలోనూ హైలైట్ చేయడంపై ఆమె టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోల వయసు గురించి చర్చించని వారు, హీరోయిన్ల విషయంలోనే ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారని ప్రశ్నించారు.

పెద్ది సెట్స్‌లో తిలక్ వర్మ.. బ్యాట్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్ చరణ్..!

పెద్ది సినిమా సెట్స్‌కు టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ వెళ్లాడు. రామ్ చరణ్‌తో కాసేపు ముచ్చటించాడు. తిలక్ వర్మకు.. పెద్ది సినిమాలో రామ్ చరణ్ వాడిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

ఆస్కార్‌ ‘ఇన్ మెమోరియం’లో కోట శ్రీనివాసరావు పేరు

కోట శ్రీనివాసరావుకు అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) వేదికగా పలువురు నివాళులు అర్పించారు. గత ఏడాది మరణించిన ప్రపంచ సినీ ప్రముఖులను స్మరించుకుంటూ అకాడమీ ‘ఇన్ మెమోరియం’ జాబితాను విడుదల చేసింది.  కోటతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌లను కూడా అకాడమీ స్మరించుకుంది. అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్యాలరీలో ఈ నలుగురు తారల చిత్రాలను ప్రదర్శించి, వారి సేవలను ప్రపంచానికి గుర్తు చేసింది. భారతీయ నటుల జాబితాలో తొలుత […]

మీరు చేసిందే తప్పు.. మళ్లీ నాపై నిందలు వేస్తారా?: మాధురిపై జాన్వీ కపూర్ ఆగ్రహం

తిరుమల కేక్ కటింగ్ వివాదంలో తన పేరును లాగడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో జాన్వీ కపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు లేని అభ్యంతరం నేను చేస్తేనే ఎందుకు?” దివ్వెల మాధురి ప్రశ్నించారు. మాధురి ఇంటర్వ్యూ క్లిప్‌ను షేర్ చేస్తూ “అసలు ఎవరు ఈ మహిళ?” అంటూ సూటిగా ప్రశ్నించారు. తనపై వచ్చిన వివాదాన్ని మళ్లించడానికి తనను వాడుకోవడం సరైన పద్ధతి కాదని, ఇతరులపై నిందలు వేయడం […]

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌కు తృటిలో త‌ప్పిన‌ ప్రమాదం..

అమెరికాలో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌ భద్రతా కారణాల వల్ల గోల్ఫ్ కార్ట్‌లో తీసుకెళ్లారు. ఈ సమయంలో డ్రైవర్ వేగంగా కార్ట్‌ను మలుపు తిప్పడంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. కార్ట్‌లోని ఒక టైర్ గాల్లోకి లేచినట్లు కనిపించింది. ఈ పరిస్థితిలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ గట్టిగా పట్టుకుని పడిపోకుండా నిలబడటానికి ప్రయత్నించారు డ్రైవర్ వాహనాన్ని మళ్లీ కంట్రోల్‌లోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ ఏపీకి కాబోయే సీఎం’ – ‘ఉస్తాద్’ విలన్ పార్థిబన్

ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుకలో తమిళ నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను “యుగానికి ఒక్కడు” అని ప్రశంసించిన ఆయన, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం థియేటర్ సీటు కాదు, సీఎం సీటునే ముందుగానే బుక్ చేశానని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తాను ఊహిస్తున్నానని పార్థిబన్ పేర్కొన్నారు.

ఆస్కార్ అవార్డు విజేతలు వీరే..

98వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఉత్తమ నటుడిగా మైఖేల్‌ బి జోర్డన్‌ నిలిచారు. సిన్నర్స్ చిత్రానికి గానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అలాగే ఉత్తమ నటిగా జెస్సీ బుక్లే కి ఆస్కార్‌ వరించింది. ఆమెకి హమ్నెట్‌ మూవీకి ఈ అవార్డు దక్కడం విశేషం. ఇక వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ మూవీకిగానూ పాల్‌ థామస్‌ ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ని సొంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే మూవీ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది

పవన్ కళ్యాణ్ చివరి సినిమా కాదు!- కుండబద్ధలు కొట్టిన డిప్యూటీ సీఎం!

తాను ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతానని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్‌కు అభయమిచ్చారు పవన్ కళ్యాణ్. నాకు అన్నం పెట్టింది, ఈరోజు ప్రజలకు సేవ చేసే స్థాయికి నన్ను చేర్చింది సినిమానే. సినిమా నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది, దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలస్యమైనా తన వెంటే ఉన్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON