ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుకలో తమిళ నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పవన్ కళ్యాణ్‌ను “యుగానికి ఒక్కడు” అని ప్రశంసించిన ఆయన, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం థియేటర్ సీటు కాదు, సీఎం సీటునే ముందుగానే బుక్ చేశానని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రజల కోసం త్యాగం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన భవిష్యత్తులో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తాను ఊహిస్తున్నానని పార్థిబన్ పేర్కొన్నారు.

