రాజ్యాంగ సవరణ బిల్లు (131వ సవరణ) లోక్ సభలో వీగిపోయింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. “ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం” అని ఆమె అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టి, దేశ రాజకీయ మ్యాప్‌ను మార్చాలని చూసిన ప్రభుత్వ కుట్రను విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ మహిళల కోసం నిలబడని వారే ఇప్పుడు విపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అని పిలవడం హాస్యాస్పదమని ప్రియాంక ఎద్దేవా చేశారు.

