తిరుమల కేక్ కటింగ్ వివాదంలో తన పేరును లాగడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో జాన్వీ కపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు లేని అభ్యంతరం నేను చేస్తేనే ఎందుకు?” దివ్వెల మాధురి ప్రశ్నించారు. మాధురి ఇంటర్వ్యూ క్లిప్‌ను షేర్ చేస్తూ “అసలు ఎవరు ఈ మహిళ?” అంటూ సూటిగా ప్రశ్నించారు. తనపై వచ్చిన వివాదాన్ని మళ్లించడానికి తనను వాడుకోవడం సరైన పద్ధతి కాదని, ఇతరులపై నిందలు వేయడం సరైనది కాదు’ జాన్వీ మండిపడ్డారు.

