కోట శ్రీనివాసరావుకు అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) వేదికగా పలువురు నివాళులు అర్పించారు. గత ఏడాది మరణించిన ప్రపంచ సినీ ప్రముఖులను స్మరించుకుంటూ అకాడమీ ‘ఇన్ మెమోరియం’ జాబితాను విడుదల చేసింది. కోటతో పాటు బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌లను కూడా అకాడమీ స్మరించుకుంది. అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్యాలరీలో ఈ నలుగురు తారల చిత్రాలను ప్రదర్శించి, వారి సేవలను ప్రపంచానికి గుర్తు చేసింది. భారతీయ నటుల జాబితాలో తొలుత కోట శ్రీనివాసరావు పేరును ప్రస్తావించడం విశేషం.

