loader

నిర్మాతలు, దర్శకులు ఎవరూ మా దగ్గరకు రావొద్దు : కోమటిరెడ్డి

సినిమాలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే టిక్కెటు రేట్లు తక్కువ ధరలుండాలని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. టికెట్‌ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని అన్నారు. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని, నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈసారి పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

రజినీకాంత్ నటన తరతరాలను అలరించింది: ప్రధాని మోదీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, ప్రముఖులు నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పెషల్ విషెష్ తెలిపారు. రజినీకాంత్ నటన తరతరాలను అలరించిందని మోదీ కొడియాడారు. 50 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, ఎన్నో ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చారు.

అఖండ- 2కు మరో ఎదురుదెబ్బ.. తీరా రిలీజ్ టైమ్‌లో హైకోర్టు జోక్యం

నందమూరి బాలకృష్ణ-‘అఖండ 2’ మూవీ డిసెంబర్ 12న అనగా రేపు విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. అఖండ 2 ప్రీమియర్ షోలు నిర్వహణకు అనుమతి ఇవ్వడం, టికెట్ రేట్లు పెంచడం‌పై సవాల్ చేస్తూ లంచ్‌-మోషన్ పిటిషన్ దాఖలు కాగా.. తాజాగా అఖండ- 2 నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ ప్రీమియర్ షోతో పాటు టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్ చేసింది తెలంగాణ […]

ఆనంద్ మ‌హీంద్రాని ఆకాశానికి ఎత్తిన చిరు..

మహీంద్రా సోషల్ మీడియా (X)లో షేర్ చేస్తూ మెగాస్టార్‌పై మ‌హీంద్రా కామెంట్‌పై చిరు కూడా స్పందించారు. డియ‌ర్ ఆనంద్ మ‌హీంద్రా మీరు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వ‌భావం ఎంతో ఆద‌ర్శ‌నీయం. మీరు చాలా సార్లు ర‌త‌న్ టాటాని గుర్తుకు తెస్తారు. ఆయ‌న త‌న విలువ‌తో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు. మీరు కూడా అలానే. సేవా కార్య‌క్ర‌మాలలో మీరు చూపుతున్న నిబ‌ద్థ‌త ఎంతో మందికి ఆద‌ర్శం. మీతో క‌లిసి ఈ కార్యక్ర‌మంలో పాల్గొన‌డం ఎంతో సంతోషాన్ని […]

బూతుల‌తో సింగ‌ర్‌ని ట్రోలింగ్.. మార్ఫింగ్ ఫొటోల‌తో దాడిపై ఫైర్ అయిన చిన్మ‌యి

సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులకు గట్టి సమాధానం ఇచ్చారు. తాజాగా ఆమెపై మార్ఫింగ్ ఫోటోలతో దాడి చేసిన వ్యక్తులపై చిన్మయి ఘాటుగా స్పందించి వీడియోను షేర్ చేశారు. చిన్మయి తన మార్ఫింగ్ చేసిన ఫోటోను, దాన్ని షేర్ చేసిన అకౌంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ, వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలిపారు. గత 8–10 వారాలుగా కొంతమంది డబ్బులు తీసుకుని తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వీడియోలో […]

ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవిని కలిశా.. ఆయనొక లెజెండ్: ఆనంద్ మహీంద్ర

ఆనంద్ మహీంద్ర – చిరంజీవి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఒక ఊహించని సర్ప్రైజ్. ఆయన ఒక లెజెండ్, కానీ ఆయనలో ఉన్న వినయం, నిజమైన ఉత్సుకత నన్ను మరింత ఆకర్షించాయి. నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, వినయంతో వినడం.. ఈ రెండు లక్షణాలు సినిమా నుండి వ్యాపారం వరకు, విధానాల వరకు ఏ రంగంలోనైనా స్థిరమైన విజయానికి పునాది అనే విషయాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేశారు’ అని […]

`దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రచ్చ స్టార్ట్ చేస్తున్నారు టీమ్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.ఉస్తాద్‌భగత్‌ సింగ్‌` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. `దేఖ్‌ లేంగే సాలా` పేరుతో సాగే ఈ పాట ప్రోమో మంగళవారంసాయంత్రం విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది.ఇందులో పవన్‌ మార్క్ స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి.

అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

మద్రాస్ హై కోర్టు అఖండ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుతున్న సమాచారం మేరకు అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు, బయ్యర్ల నుంచి కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయాయి కాబట్టి నిర్మాతలు మరోసారి అదనపు టికెట్ ధరల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లై చేసినట్లు తెలుస్తోంది. 11 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 నిర్వాహకులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. గోవా ఫిలిం ఫెస్టివల్ లో నిహారిక, నాగార్జున కలుసుకున్నారు. అక్కడ వీరిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ బాస్ 9 గురించి, భరణి గురించి చర్చ వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది. భరణి మేనేజ్మెంట్ కోటా అనే విషయం మరోసారి కన్ఫర్మ్ అయింది అంటూ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON