ఆనంద్ మహీంద్ర – చిరంజీవి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం ఒక ఊహించని సర్ప్రైజ్. ఆయన ఒక లెజెండ్, కానీ ఆయనలో ఉన్న వినయం, నిజమైన ఉత్సుకత నన్ను మరింత ఆకర్షించాయి. నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, వినయంతో వినడం.. ఈ రెండు లక్షణాలు సినిమా నుండి వ్యాపారం వరకు, విధానాల వరకు ఏ రంగంలోనైనా స్థిరమైన విజయానికి పునాది అనే విషయాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేశారు’ అని ఆనంద్ మహీంద్ర ఎక్స్ లో పేర్కొన్నారు.

