loader

నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్ కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా… ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది” అని చిరంజీవి అన్నారు.

పట్టాలెక్కిన తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్

తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్‌లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం […]

సింగరేణి మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలు ఉండగా కారేపల్లి జనరల్, అప్పాయిగూడెం ఎస్సీ జనరల్, మిగతా 39 గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వ్‌డ్ కలిగి ఉన్నాయి. కాగా వీటిల్లో కొత్తతండా, కొత్త కమలాపురం, టేకులగూడెం, గిద్దెవారిగూడెం, బోటితండా, వెంకట్యాతండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు ఒకే నామినేషన్ రావడంతో ఆ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం అనివార్యమైంది

ఓట్ల చోరీ ఆరోపణలు…కేంద్రంపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలను లేవనెత్తారు. 1.ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) ఎందుకు తొలగించారు?. 2.2023 డిసెంబర్‌లో ప్రభుత్వం చట్టాన్ని (ఎన్నికల కమిషనర్లకు సంబంధించి) మార్చింది. ఎన్నికల కమిషనర్లుగా ఉన్నప్పుడు వారు తీసుకున్న ఏ చర్యకైనా శిక్ష పడకుండా ఉండేలా ఈ చట్టాన్ని ఎందుకు మార్చారు? 3.పోలింగ్ జరిగిన 45 రోజుల తర్వాత పోలింగ్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకొచ్చారు.

స్క్రిప్ట్‌తో వచ్చి సినిమాలు పూర్తి చేసుకుని వెళ్లండి…సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’లో సినీనటులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్క్రిప్ట్‌తో వచ్చి సినిమాలు పూర్తి చేసుకొని వెళ్లండి అని వారికి సూచించారు.  ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను […]

 మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

భారత ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. ఈ మేరకు ఇండియాలో 17.5 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడికి హామీ ఇచ్చారు సత్య నాదెళ్ల. దేశంలో కృత్రిమ మేథ(AI) సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. కాగా, ఆసియాలో మైక్రోసాఫ్ట్‌ తరఫున ఇదే అతిపెద్ద పెట్టుబడి అని అమెరికా సాఫ్ట్‌వేర్ దిగ్గజం పేర్కొన్నారు.

PPP మోడల్‌ అనివార్యం – గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనకు ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్ షిప్ లు అని వార్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం, ఆతిథ్యం తెలంగాణ ఫిలాసఫీ అని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం, తక్కువ ధరకు నైపుణ్యం తో కూడిన స్కిల్ లేబర్, శాంతి భద్రతలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయని చర్చా గోష్టిలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

`దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రచ్చ స్టార్ట్ చేస్తున్నారు టీమ్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.ఉస్తాద్‌భగత్‌ సింగ్‌` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. `దేఖ్‌ లేంగే సాలా` పేరుతో సాగే ఈ పాట ప్రోమో మంగళవారంసాయంత్రం విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది.ఇందులో పవన్‌ మార్క్ స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి.

బీఎల్​ఓలను బెదిరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం​- అరాచకానికి దారితీస్తుందని వ్యాఖ్య

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​) 2.0లో భాగంగా పనిచేస్తున్న బూత్​ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓ), ఇతర అధికారులు, బంగాల్​ సహా ఇతర రాష్ట్రాల్లో బెదిరింపులకు గురవుతుండడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. “ఎస్​ఐఆర్​కు సహకరించకపోవడం, బీఎల్​ఓల పనికి ఆటంకాలు కలిగించడం, బెదిరించడం లాంటి ఘటనలను మా దృష్టికి తీసుకురండి. మేము వారికి తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం” అని ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది.

ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇండోనేషియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని జకర్తాలోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.జపనీస్ డ్రోన్ సంస్థ టెర్రా డ్రోన్ కార్పొరేషన్‌ బిల్డింగ్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. కాసేపటికే అవి భవనం మొత్తం వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 20 మంది మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON