తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతి – సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్‌లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

