loader

హైదరాబాద్‌లోని రోడ్లకు ట్రంప్‌, రతన్ టాటా పేర్లు – ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్​లోని కీలక రహదారులకు ప్రముఖ వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని తుది నిర్ణయం కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు […]

మారణాయుధాలతో దాడి.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం

నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నక్కలోళ్ల సెంటర్ వద్ద సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆదివారం దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ మన్సూర్ గొంతు కోశారు. అలాగే బస్సు కండక్టర్ సలీమ్‌పై దాడి చేశారు. రహదారిపై బైక్ అడ్డంగా నిలిపి ఉంది. ఆ వాహనాన్ని పక్కకు తీయాలంటూ యువకులకు బస్సు డ్రైవర్ సూచించాడు. ఆ క్రమంలో యువకులు, బస్సు డ్రైవర్‌‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆ యువకులు మారణాయుధాలతో […]

415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్‌లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

‘అభినవ కృష్ణదేవరాయ’గా పవన్‌ కల్యాణ్‌.. బిరుదును ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే ప్రత్యేక బిరుదును అందుకున్నారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్‌ గీతోత్సవ మహోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా ఈ బిరుదును పవన్‌కు ప్రదానం చేశారు. ఈ వేడుకకు తాను ఉప ముఖ్యమంత్రిగా కాకుండా.. ఆధ్యాత్మికతను అన్వేషించే సాధకుడిగా వచ్చానని స్పష్టం చేశారు. నాయకత్వం అంటే పదవులు కాదని.. ప్రజల కోసం తీసుకునే సత్ప్రయత్నాల సమాహారమని […]

రోడ్డు బాగోలేక వాహనాలు బంద్‌.. అటవీ మార్గంలో నడిచి స్కూల్‌కు

రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు సుమారు ఏడు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పచ్చెదొడ్డి గ్రామంలోని రోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో బస్సు సర్వీసు నిలిచిపోయింది. టవీ జంతువుల దాడి గురించి వారు భయాందోళన చెందుతున్నారు.

కేయూ విద్యార్థులకు ఉప్మాలో పురుగులు.. ఆందోళనకు దిగిన విద్యార్థులు

కాకతీయ విశ్వవిద్యాలయం కామన్‌ మెస్‌లో విద్యార్థులకు పురుగుల టిఫిన్‌ పెట్టడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం ఉప్మా (నాటు రవ్వ) లో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌ డైరెక్టర్‌ను తొలిగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. వర్సిటీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో హాస్టల్‌ డైరెక్టర్‌ విద్యార్థులకు నాణ్యమైన టిఫిన్‌, భోజనం అందించడంలేదని ఆందోళనకు దిగారు.

మామిడితోటకు పని కోసం వెళ్తే.. ప్రాణాలు పోయాయ్..

అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలంలో  కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్‌ వద్ద నివసించే నరేంద్ర , చరణ్‌ సోదరులు. వీరిద్దరూ తల్లిదండ్రులు, మరికొందరితో కలిసి ఆదివారం ఉదయం పాల వెంకటాపురం గ్రామంలోని మామిడితోటకు పని కోసం వెళ్లారు. మామిడి తోటలోని చెట్లకు పురుగులమందు పిచికారీ చేయడానికి వెళ్లారు. ఈ సమయంలో చరణ్ ప్రమాదవశాత్తూ కాలుజారి నీటి కుంటలో పడిపోయారు. తమ్ముణ్ని కాపాడే ప్రయత్నంలో అన్న నరేంద్ర కూడా నీటికుంటలో పడిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవటంతో.. నీటిలో మునిగి ప్రాణాలు […]

కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ

కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సురేశ్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

గోవా నైట్‌క్లబ్‌ ప్రమాదంపై పోలీస్‌ చర్య.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు

గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోవడంపై నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రాలపై, క్లబ్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై  వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.   అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఇరుకైన ప్రవేశ మార్గం, తప్పించుకునే మార్గాలు లేకపోవడం, నిర్మాణంలో మండే స్వభావం కలిగిన సామగ్రిని వాడటం వంటివి ప్రమాద కారణాలుగా  ప్రాథమిక విచారణలో వెల్లడికావడంతో పోలీసులు తాజా చర్యలకు […]

ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి

దాదాపు వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం..ప్రయాణికులకు టిక్కెట్‌ డబ్బులను రీఫండ్ చేయాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌరవిమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. సుమారు 3000 వేల వరకూ సూట్‌కేసులు, ఇతర లగేజీని కూడా తిరిగిచ్చినట్టు తెలిపింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON