రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్‌లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

