నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. నక్కలోళ్ల సెంటర్ వద్ద సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆదివారం దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. డ్రైవర్ మన్సూర్ గొంతు కోశారు. అలాగే బస్సు కండక్టర్ సలీమ్‌పై దాడి చేశారు. రహదారిపై బైక్ అడ్డంగా నిలిపి ఉంది. ఆ వాహనాన్ని పక్కకు తీయాలంటూ యువకులకు బస్సు డ్రైవర్ సూచించాడు. ఆ క్రమంలో యువకులు, బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఆ యువకులు మారణాయుధాలతో దాడి చేశారు.

