loader

డార్లింగ్ ఫ్యాన్స్‌కు క్రిస్మస్ ట్రీట్.. ‘ది రాజా సాబ్’ నుండి మ్యూజికల్ సర్ప్రైజ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా నుంచి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అభిమానులకు అందించింది. ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ సర్ప్రైజ్‌ను విడుదల చేసింది. ‘రాజే యువరాజే..’(Raje Yuvaraje) అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేస్తూ, ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

వారణాసి’లో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్… ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన విల‌క్ష‌ణ న‌టుడు

నటుడు ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘వారణాసి’ చిత్రంలో తాను కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో, “వారణాసి సినిమా కోసం ఒక అద్భుతమైన షెడ్యూల్‌ను పూర్తి చేశాము. ఈ పాత్ర నాలోని నటుడి దాహార్తిని తీరుస్తోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా మీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. తదుపరి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

ఇది మీ చేతకాని తనం.. నీ అసలు రూపం ఇదీ: శివాజీపై మరోసారి చెలరేగిన అనసూయ

నటుడు శివాజీ, నటి అనసూయ భరద్వాజ్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆమె అసలు ఈ ఇష్యూలోకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించిన శివాజీ.. తనపై జాలి చూపించినందుకు థ్యాంక్స్ చెప్పారు ఆపై ఆయన క్షమాపణలు, అనసూయ కౌంటర్లు.. ఇదంతా ఇప్పుడు హాట్ టాపిక్. శివాజీ ‘విక్టిమ్ ప్లే’ చేస్తున్నారని, ఇది నార్సిసిజం, మిసోజనిస్టిక్ లక్షణమని అనసూయ విమర్శించారు. ఆడవాళ్ళ హక్కులు, స్వేచ్ఛ గురించి ఆమె గట్టిగా మాట్లాడారు.

దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు

నటుడు శివాజీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టకేలకు శివాజీ దిగొచ్చాడు. మహిళలకు క్షమాపణలు చెప్పాడు. నేను మాట్లాడింది అందరు అమ్మాయి గురించి కాదు, హీరోయిన్‌ బయటికి వెళ్లినప్పుడు దుస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశ్యం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్టి. ఒక అమ్మావారిలా అనుకుంటాను. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, మహిళలు ఎవరైతే తప్పుగా భావిస్తే, మీ అందరికి […]

‘నీ నీతులు ఇంట్లోనే చెప్పుకో’.. నటుడు శివాజీకి ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్‌ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా స్పందిస్తూ.. హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నాకు అనవసరం. నీలాంటి ఒక అసభ్యకరమైన పద్ధతి లేని వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి.. వెళ్లి నీ నీతులు వాళ్ల‌కి చెప్పుకో. అంతేగాని సమాజంలో ఉన్న‌ మహిళలపై గానీ, చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై గానీ నీ చెత్త అభిప్రాయాలను రుద్ద‌కు” అంటూ శివాజీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇమ్మాన్యూయేల్ ఎలిమినేట్..

అడియన్స్,సోషల్ మీడియా అస్సలు ఊహించని విధంగా నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు ఆల్ రౌండర్ ఇమ్మాన్యూయేల్. బిగ్ బాస్ సీజన్ 9 ముందు నుంచి అన్ లిమిటేడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. ప్రతి సందర్భంలో తన కామెడీ పంచులతో హౌస్ లో నవ్వులు పూయించాడు. బిగ్ బాస్ సీజన్ 9 అంటే ఇమ్మాన్యుయేల్ అన్నట్లుగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. ఒకానొక సమయంలో సీజన్ 9 విన్నర్ అనే రేంజ్ లో అత్యధిక ఓటింగ్ తో టాప్ 1లో […]

ఫ్యాన్స్ ఓవరాక్షన్.. అల్లాడిపోయిన నిధి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ తిరిగి వెళ్లేందుకు నిధి ప్రయత్నిస్తుండగా, ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ వైరల్ వీడియోలో గుంపులు గా ఉన్న జనాల మధ్య నుంచి.. తన కారు దగ్గరకు వెళ్లడానికి.. నిధి అగర్వాల్ ఎంత ఇబ్బంది పడింది అనేది […]

చేతులు జోడించి మొక్కుతున్నా..ఏఐ చెత్తకు సపోర్ట్ చేయకండి- శ్రీ లీల

హీరోయిన్లకు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఒరిజినల్ అనిపించేలా మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు అసభ్యంగా చూపిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి తప్ప మరింత క్లిష్టతరంగా మార్చకూడదనేది తన అభిప్రాయం అని ఏఐ జనరేటెడ్ చెత్త (నాన్సన్స్)ను సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్‌కు చేతులు జోడించి మొక్కారామె. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం వేరని, అసభ్యతకు వాడటం వేరని రెండిటి మధ్య తేడా ఉందని, అది ప్రతి ఒక్కరూ […]

లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా… ప్రభాస్ ‘రాజా సాబ్’

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా’ అంటూ సాగే మెలోడీ ప్రోమోని విడుదల చేశారు. తాజాగా ఆ పాట పూర్తి వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. కృష్షకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. తమన్ సంగీతం అందించారు. యూరప్ లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది.‌

మంచు మనోజ్ లేటెస్ట్ చిత్రం.. గ్లింప్స్ అదిరిపోయింది..

ఈ ఏడాది రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON