loader

జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌ తుది నోటిఫికేషన్ విడుదల

బృహత్ హైదరాబాద్ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి తుది నోటిఫికేషన్​ను విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. అలాగే, జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు పెంచుతూ, 30 సర్కిళ్లను 60కి పెంచుతున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డివిజన్ల డీలిమిటేషన్‌కు 10 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6వేలకు పైగా అభ్యంతరాలు రాగా.. సహేతుకమైన వాటిని పరిగిణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు […]

‘తప్పుడు కథనాలతో విభేదాలను సృష్టించే ప్రయత్నం’- అమెరికా నివేదికపై చైనా ఆగ్రహం

భారత సంబంధాలపై అమెరికా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది చైనా. భారత్​తో తగ్గిన సరిహద్దు ఉద్రిక్తతలను ఉపయోగించి అమెరికా-ఇండియా సంబంధాలను దెబ్బతీస్తోందని పెంటగాన్ విడుదల చేసిన నివేదికను తప్పుబట్టింది. పాకిస్థాన్‌తో చైనా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటోందని తప్పుడు కథనాలతో విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని డ్రాగన్ ఆరోపించింది. అమెరికా తన సైనిక ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఒక సాకును కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు.

న్యూట్రిషన్ అడ్వైజరీ కమిటీకి భారత సంతతి డాక్టర్ నియామకం

టెక్సాస్ న్యూట్రిషన్ అడ్వైజరీ కమిటీకి భారత సంతతి ఫిజీషియన్ పద్మజా పటేల్‌ను గవర్నర్ గ్రెగ్ అబోట్ నియమించారు. 2029 సెప్టెంబరు 1 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ లోని బరోడా మెడికల్ కాలేజీ నుంచి మెడికల్ డిగ్రీ పొందిన పద్మజా పటేల్ అమెరికాలో తన శిక్షణ పూర్తి చేశారు. నుడ్జ్ హెల్త్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అమెరికన్ కాలేజీ ఆఫ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ హెల్త్‌సిటీ మిడ్‌ల్యాండ్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ కాలేజీ ఆఫ్ […]

క్రిస్మస్ నాడు ఉక్రెయిన్ పై ఆగని రష్యా బాంబుదాడి

క్రిస్మస్ నాడు కూడా రష్యా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడడంలో రెండు దేశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ రోజు సాయంత్రం ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రెసిడెంట్ జెలెస్ స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోవాలని శాపనార్థాలు పెట్టారు.క్రిస్మస్ ఈవ్ ముందు మంగళవారం ఉక్రెయిన్ లో రష్యా భారీ ఎత్తున క్షిపణుల దాడి చేసింది.  దాడులలో ముగ్గురు చనిపోయారు. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ కేంద్రం దెబ్బతింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ తన […]

మీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిళ్లు రావు! వేలాది ఆర్డర్లు నిలిపివేత..

మీ జొమాటో ఆర్డర్ ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అయిందా? కారణం ఇదే! తమ సమస్యల పరిష్కారం కోసం గిగ్ కార్మికులు నేడు నిరసన బాట పట్టారు. పండుగ రోజున సేవలు నిలిచిపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా గిగ్ కార్మికులు ప్రకటించిన దేశవ్యాప్త సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు బ్లింకిట్ వంటి అగ్రిగేటర్లలో పనిచేసే లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నేడు విధులను బహిష్కరించారు.

తిరుమలలో పెరుగుతున్న రద్దీ- అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద గందరగోళం!

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వరుస సెలవులు కారణంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఏడు కొండులు జనసంద్రంతో నిండిపోయాయి. ఈ క్రమంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ గందరగోళం ఏర్పడింది. అలిపిరి భూదేవీ కాంప్లెక్స్‌లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు తీసుకునే టైంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు ఆరోపించారు. SSD టోకెన్లు పూర్తికావడంతో దివ్యదర్శనం టోకెన్ల కోసం భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారని […]

టిజిఎస్‌ఆర్‌టిసిలో 198 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టుల భర్తీకి రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టిఎస్‌ఎల్‌పిఆర్‌బి)నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పోస్టుల వివరాలు వెల్లడించారు. రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌లోట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీ(టిఎస్‌టి), మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ (ఎంఎస్‌టి) పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీకి 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీకి 114 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపిన జనం.. అతడిపై దోపిడీ ఆరోపణలు

అల్లర్లతో రగులుతున్న బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు. అతడు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఆ దేశ పోలీసులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ డిసెంబర్‌ 24న రాత్రి 11 గంటల సమయంలో డబ్బుల వసూలు కోసం గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికి అనుచరులతో కలిసి సామ్రాట్ వెళ్లినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆ కుటుంబం దొంగలని అరవడంతో స్థానికులు […]

డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. భీమవరం నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల నిర్వహణకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని.. నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

డార్లింగ్ ఫ్యాన్స్‌కు క్రిస్మస్ ట్రీట్.. ‘ది రాజా సాబ్’ నుండి మ్యూజికల్ సర్ప్రైజ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా నుంచి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అభిమానులకు అందించింది. ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ సర్ప్రైజ్‌ను విడుదల చేసింది. ‘రాజే యువరాజే..’(Raje Yuvaraje) అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేస్తూ, ప్రభాస్ వింటేజ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON