మీ జొమాటో ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అయిందా? కారణం ఇదే! తమ సమస్యల పరిష్కారం కోసం గిగ్ కార్మికులు నేడు నిరసన బాట పట్టారు. పండుగ రోజున సేవలు నిలిచిపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా గిగ్ కార్మికులు ప్రకటించిన దేశవ్యాప్త సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు బ్లింకిట్ వంటి అగ్రిగేటర్లలో పనిచేసే లక్షలాది మంది డెలివరీ భాగస్వాములు నేడు విధులను బహిష్కరించారు.

