క్రిస్మస్ నాడు కూడా రష్యా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడడంలో రెండు దేశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ రోజు సాయంత్రం ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రెసిడెంట్ జెలెస్ స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోవాలని శాపనార్థాలు పెట్టారు.క్రిస్మస్ ఈవ్ ముందు మంగళవారం ఉక్రెయిన్ లో రష్యా భారీ ఎత్తున క్షిపణుల దాడి చేసింది. దాడులలో ముగ్గురు చనిపోయారు. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ కేంద్రం దెబ్బతింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ తన ప్రసంగంలో పుతిన్ చనిపోవాలన్న కోరిక వెల్లడించారు.

