loader

చేతులు జోడించి మొక్కుతున్నా..ఏఐ చెత్తకు సపోర్ట్ చేయకండి- శ్రీ లీల

హీరోయిన్లకు సరికొత్త ముప్పు ఏర్పడింది. ఒరిజినల్ అనిపించేలా మార్ఫింగ్ వీడియోలు ఫోటోలు అసభ్యంగా చూపిస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసేలా ఉండాలి తప్ప మరింత క్లిష్టతరంగా మార్చకూడదనేది తన అభిప్రాయం అని ఏఐ జనరేటెడ్ చెత్త (నాన్సన్స్)ను సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్‌కు చేతులు జోడించి మొక్కారామె. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం వేరని, అసభ్యతకు వాడటం వేరని రెండిటి మధ్య తేడా ఉందని, అది ప్రతి ఒక్కరూ […]

బంగ్లాదేశ్‌లో రెచ్చిపోయిన ర్యాడికల్స్.. ఢాకాలో భారత ఎంబసీపై దాడికి యత్నం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై ర్యాడికల్ గ్రూప్ దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. భద్రతా కారణాల రీత్యా డిసెంబరు 17న బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢాకాలోని రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు భారత ప్రకటించింది. ఢాకాలోని ఎంబసీకి బెదిరింపులు, బంగ్లా రాజకీయ నాయకుల విద్వేషపూరిత ప్రకటనలపై భారత్ ఇప్పటికే స్పందించి, భారత్ నిరసన తెలియజేసిన కొద్ది గంటల్లోనే ఢాకాలోని ఎంబసీపై దాడికి యత్నించడం

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖూనీ చేసింది.. కేటీఆర్‌ ధ్వజం

ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును  బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని.. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ […]

లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా… ప్రభాస్ ‘రాజా సాబ్’

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా’ అంటూ సాగే మెలోడీ ప్రోమోని విడుదల చేశారు. తాజాగా ఆ పాట పూర్తి వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. కృష్షకాంత్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా పాడారు. తమన్ సంగీతం అందించారు. యూరప్ లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది.‌

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్..విమర్శల వెల్లువ

అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ తో కలిసి కన్జర్వేటివ్ పాడ్ కాస్టర్ కేటీ మిల్లర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒకవైపు బ్రౌన్స్ యూనివర్సి టీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్ కాస్టర్ లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు సమయం […]

70 ఏళ్లకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటు వేసిన గ్రామం

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీ గత 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న ఈ పంచాయతీ స్థానం ఈసారి ఎన్నికలు జరిగి తీరాల్సిందే ఆశావాహులు పట్టుపట్టారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణ కల నెరవేరింది. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచి నిలవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశామన్న ఆనందం ఆ గ్రామవాసులు.. అందులోనూ వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

మంచు మనోజ్ లేటెస్ట్ చిత్రం.. గ్లింప్స్ అదిరిపోయింది..

ఈ ఏడాది రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్‌లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం […]

హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులు ఇక్కడే..

ారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఘన స్వాగతం పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె ఐదు రోజుల పాటు బస చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా 19న రామోజీ ఫిల్మ్‌సిటీని, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ సందర్శించనున్నారు. 21న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, పౌరులతో భేటీ అయి ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని […]

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తాం.. స్పీకర్‌ తీర్పుపై మండిపడ్డ కేపీ వివేకానంద

ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కొట్టివేయడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్‌ విఫలమయ్యాడని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్‌లో ఉన్నారని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారని చెప్పారు.

కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పైసాను సమగ్రంగా వినియోగించుకోవాలి: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రాయోజిత పథకాలు (సీఎస్ఎస్), నిధుల వినియోగంపై బుధవారం సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను వాడుకోవాలని, కొన్ని శాఖలు, జిల్లాల్లో నిధుల వినియోగంలో జాప్యం జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏడాది చివరలో కేంద్రం వద్ద నిధులు ఉండిపోతాయని, వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో వెనుకబడకూడదని స్పష్టం చేశారు. ఒకవైపు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, చేతిలో ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడం సరైన పద్ధతి కాదని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON