ారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె ఐదు రోజుల పాటు బస చేయనున్నారు. తన పర్యటనలో భాగంగా 19న రామోజీ ఫిల్మ్‌సిటీని, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ సందర్శించనున్నారు. 21న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు,
పౌరులతో భేటీ అయి ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

