loader

రేవంత్‌ నీ చీప్‌ ట్రిక్స్‌కు ఎవడూ పడిపోడు.. సీఎం వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌

రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కిండన్నారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నడని.. తన కుర్చీ త్వరలోనే ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో అడ్డగోలుగా వాగిండని.. నాకు, కేటీఆర్‌కు మధ్యమిత్ర బేధం సృష్టించాలని.. తద్వారా బీఆర్ఎస్‌ను బలహీన పరచాలని రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డీ నీ చీప్ ట్రిక్కులకు […]

అమెజాన్‌లో లేఆఫ్స్…లక్సెంబర్గ్‌లో 370 మంది ఉద్యోగుల తొలగింపు

టెక్ దిగ్గజ కంపెని అమెజాన్‌ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. లక్సెంబర్గ్‌లో యూరప్ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 370కి పైగా అమెజాన్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఉద్యోగుల తొలగింపు అమెజాన్ కంపెనీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద లేఆఫ్స్‌గా నిలిచింది. ప్రారంభంలో అమెజాన్ 470 ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు వేసింది కానీ, యూరోపియన్ యూనియన్ కార్మిక చట్టాల ప్రకారం తప్పనిసరి చర్చల సమయంలో ఆ సంఖ్యను తగ్గించింది

మూసీలో కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉంది.. సీఎం రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయినా ఇంకా ప్రతిపక్ష పార్టీకి అహంకారం తగ్గలేదంటూ ధ్వజమెత్తారు. ఇంకొకాయన కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మూసీలోని కాలుష్యం కంటే వీళ్ళ కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని… బరితెగించి వ్యవహరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

అన్నీ ప్రైవేటీకరిస్తే పేదల పరిస్థితి ఏంటి? … వైఎస్ జగన్

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్‌భవన్‌కు తరలించగా… గవర్నర్‌ కార్యాలయ అధికారులు ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్‌ జగన్‌ తన భేటీలో గవర్నర్‌కు చూపించారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను వివరించారు. మెడికల్‌ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్ గవర్నర్‌ […]

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల.. సెలక్షన్‌ లిస్ట్‌ను విడుదల చేసిన TGPSC

తెలంగాణ గ్రూప్‌-3 అభ్యర్థుల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెలక్షన్‌ లిస్ట్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-3కి 1,370 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో జరిగిన గ్రూప్‌-3 పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డి స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించిన పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

బెళగావి రైలులో మంటలు.. శంకర్‌పల్లిలో ఘటన

హైదరాబాద్‌ నుంచి బెళగావి వెళ్తున్న స్పెషల్‌ రైలు బోగీల కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. బ్రేక్‌ జామ్‌ అవడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత రైలు తిరిగి బెళగావికి బయలుదేరి వెళ్లింది

ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి

రైలులో ప్రయాణించే వారు నిర్ణీత పరిమితికి మించి సామాను తీసుకువస్తే ఇక తప్పనిసరిగా అదనపు చార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. సెకండ్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోలు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు 40 కిలోలు, ఏసీ 3 టైర్, చైర్ కార్‌లో కూడా 40కిలోలు, ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోలు, ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు అత్యధికంగా 70 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం […]

రూ. 15 వేల కోట్ల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదే

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి ప్రభుత్వానిదేనని, అది అటవీ ప్రాంతమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ భూమి తమదేనంటూ నిజాం, సాలార్‌జంగ్, మీరాలం వారసులమని చెప్పుకునే సుమారు 260 మందికి పైగా వ్యక్తులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు.

స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే.. కోర్టుకు వెళ్లండి: సీఎం రేవంత్ రెడ్డి

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో శాసనసభ స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించబోమని..ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన రెబల్ అభ్యర్థులతో కలిపి దాదాపు 66 శాతం స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో కూటమిగా పోటీ చేసినప్పటికీ, ప్రజలు వారిని తిరస్కరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం 33 శాతం స్థానాలకే ఆ కూటమి పరిమితమైందని గణాంకాలతో సహా వివరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్ప‌త్రి సిబ్బంది 82 మందికి షోకాజు నోటీసులు

అనుమ‌తి లేకుండా విధుల‌కు గైర్హాజ‌రైన 19 మందికి అలాగే స‌మ‌య పాల‌న పాటించ‌ని 63 మంది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రి సిబ్బందికి జిల్లా క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు షోకాజు నోటీసులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్ప‌త్రిని గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీ చేసి మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా విధులకు హాజరు కానీ వారిపై క‌లెక్ట‌ర్ చర్యలు తీసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON