తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి ప్రభుత్వానిదేనని, అది అటవీ ప్రాంతమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ భూమి తమదేనంటూ నిజాం, సాలార్జంగ్, మీరాలం వారసులమని చెప్పుకునే సుమారు 260 మందికి పైగా వ్యక్తులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు.

