బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయినా ఇంకా ప్రతిపక్ష పార్టీకి అహంకారం తగ్గలేదంటూ ధ్వజమెత్తారు. ఇంకొకాయన కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
మూసీలోని కాలుష్యం కంటే వీళ్ళ కడుపులోనే ఎక్కువ విషం ఉందని ఇకనైనా ఇప్పటికైనా అహంకారం, అసూయ తగ్గించుకోవాలని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించాలని… బరితెగించి వ్యవహరిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

