అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 19 మందికి అలాగే సమయ పాలన పాటించని 63 మంది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజు నోటీసులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మూడు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విధులకు హాజరు కానీ వారిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

