మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులతో కూడిన 26 వాహనాలను లోక్‌భవన్‌కు తరలించగా… గవర్నర్ కార్యాలయ అధికారులు ఆ పత్రాలు పరిశీలించారు. వాటన్నింటినీ వైఎస్ జగన్ తన భేటీలో గవర్నర్‌కు చూపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణను వివరించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్ గవర్నర్ అబ్ధుల్నజీర్కు విజ్ఞప్తి చేశారు.

