loader

ముఖేష్ అంబానీ ఇంట హిల్లరీ క్లింటన్.. ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ దంపతులు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు ఘన స్వాగతం పలికారు. ముంబైలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆతిథ్య కార్యక్రమంలో వారి కుమార్తె ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక సంబంధాలను, ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది.

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం(ఎక్స్)‌లో నారా భువనేశ్వరి ట్వీట్ పెట్టారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని  అన్ని ఉత్పత్తులూ 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే.. […]

స్టాక్ మార్కెట్‌లలో భారీ విధ్వంసం! 5.3 లక్షల కోట్లు ఆవిరి!

మూడు రోజుల లాభాల తర్వాత, వారంలోని నాల్గో ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా కుప్పకూలాయి. ప్రారంభ లాభాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్, ఆటో, మెటల్, FMCG స్టాక్‌లలో భారీ అమ్మకాలు కనిపించాయి, దీని వలన పెట్టుబడిదారులకు దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా పడిపోయాయి. నిఫ్టీ 50 కూడా దాదాపు 400 పాయింట్లు (సుమారు 1%) తగ్గి 25,400 వద్దకు చేరుకుంది. BSEలో మొత్తం మార్కెట్ క్యాప్ దాదాపు ₹466 […]

బంగారం ధరలపై బాంబు పేల్చిన అమెరికా.. సంచలన ప్రకటన

చైనాకు చెందిన రిటైల్ పెట్టుబడిదారులు, పెద్ద సంస్థలు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్లే ధరలు ఆకాశాన్ని తాకాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మార్కెట్లలో జరుగుతున్న అస్థిరమైన ట్రేడింగ్ వల్లనే బంగారం ధరలు నియంత్రణ లేకుండా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పసిడి ధరల్లో కనిపిస్తున్న ఈ తీవ్రమైన ఒడిదుడుకులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. .

ఓయో రూమ్స్ ఆఫర్లు అని చెప్పి క్లిక్ చేసారో అంతే సంగతి !!

వాలంటైన్స్ డే సందర్భంగా ఈ ఏడాది హోటల్ రూమ్ బుకింగ్స్ ఊహించని రీతిలో 170% పెరిగాయి. ఈ విపరీతమైన డిమాండ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రముఖ హోటల్ చైన్ ‘ఓయో’ (OYO) పేరుతో సోషల్ మీడియాలో రకరకాల నకిలీ ఆఫర్లను సృష్టిస్తున్నారు. “కేవలం రూ.499లకే లగ్జరీ రూమ్”, “ప్రేమికుల కోసం 80% డిస్కౌంట్” అంటూ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆకర్షణీయమైన లింక్‌లను పంపిస్తున్నారు. ఈ ఆఫర్లను చూసి నిజమేనని నమ్మి క్లిక్ చేసేవారు ప్రమాదంలో పడుతున్నారని […]

85 కోట్ల న‌ష్టం.. రాజేంద్ర లోధాను అరెస్టు చేసిన ఈడీ

లోధా డెవ‌ల‌ప‌ర్స్ లిమిటెడ్ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ మాజీ డైరెక్ట‌ర్ రాజేంద్ర లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అరెస్టు చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అత‌న్ని ఈడీ అదుపులోకి తీసుకున్న‌ది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్‌లో స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో రాజేంద్ర లోధా సుమారు 85 కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎల్‌డీఎల్ కంపెనీకి కావాలనే ఆయ‌న సుమారు 85 కోట్ల న‌ష్టానికి క‌ల‌గ‌చేసిన‌ట్లు లోధాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో క్రైం బ్రాంచ్ కేసులో ఆయ‌న్ను […]

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో కీలక రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, మే-జూన్ నెలల్లో బెంగళూరులో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించనుంది. ఈ వార్తలతో స్విగ్గీ, జొమాటోల షేర్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి.

హైదరాబాద్‌లో UBS కొత్త సెంటర్ ..కొత్త ఉద్యోగాల జాతర

స్విస్ బహుళజాతి పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ UBS బుధవారం హైదరాబాద్‌లో తన కొత్త గ్లోబల్ కెపెబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించింది. ఈ కేంద్రం UBSకు నగరంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మరియు భారతదేశం పట్ల తన దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటించడానికి కీలకమైన అడుగు అని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త కేంద్రం ప్రారంభంతో రాబోయే రెండేళ్లలో దాదాపు 3వేల మంది నిపుణులను UBS నియమించనుందని సంస్థ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్‌లు- ఐటీ షేర్లు కకావికలం!

భారత స్టాక్ మార్కెట్‌లో భారీగా నష్టపోయాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 465 పాయింట్లు పడిపోయింది, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 25,821 కంటే దిగువన ట్రేడవుతోంది. ట్రేడింగ్ రోజున ఐటి స్టాక్‌లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ స్టాక్‌లు నిఫ్టీలో 5 శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ కూడా ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్‌కు అనుకూలంగా లేదు. ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి.  హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ […]

గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు షాక్

బంగారం, వెండి ధరలు మళ్లీ భారీ షాక్ ఇచ్చాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1310 పెరిగింది. దీంతో తులం ధర రూ.1,57,910కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1200 పెరిగి తులం ధర రూ.1,44,750గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక్కరోజే కిలోకు రూ.15,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON