loader

పాక్‌ను చిత్తు చేసిన భారత్- 61 పరుగుల తేడాతో ఘన విజయం

హిస్టరీ రిపీట్ అయింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ సేన పరుగుల తేడాతో పాక్ జట్టును చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ రాణించలేదు. 18 ఓవర్లలో 114 పరుగులకు పాక్ […]

అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ మృతి

ఈ నెల 9న అమెరికాలోని బర్కిలీలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆయన మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సాకేత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నాడు. 9వ తేదీన చివరిసారిగా క్యాంపస్ సమీపంలోని లేక్ అంజా వద్ద కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సమీపంలోనే అతని పాస్ట్‌పోర్టు, ల్యాప్‌టాప్, బ్యాగ్‌తో అక్కడే అతడి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులకు […]

రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మరియు వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రారంభమవుతుంది. గెలిచిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లలో కనీసం సగం మంది (50%) హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి ఎన్నికను నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియను “చేయి ఎత్తే విధానం” […]

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి, ప్రమాదమా? హత్యా?

ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. కారు నీటిలో పడిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు, శ్రీనివాస్ నుదురు, ముఖంపై గాయాలు కనిపించడం వల్ల ఇది ప్రమాదమా? లేక ముందే దాడి జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై ఆయన పుస్తకం పెద్ద చర్చకు దారితీసి లక్షల కాపీలు అమ్ముడైంది. హత్య జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ […]

పాకిస్థాన్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 27వ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశారు. భారత్- పాకిస్థాన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో యువరాజ్ కంటే వేగంగా ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. ఇషాన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, యువరాజ్ సింగ్ 2012లో పాకిస్థాన్‌పై టీ20 మ్యాచ్‌లో 29 […]

ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. నగర పరిధిలో ఉన్న ఓ ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ఎక్కువ మొత్తం ప్టాస్టిక్ సామాగ్రి ఉండడంతో కొన్ని క్షణాల్లోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలుతో పాటు పొగ ఎగిసిపడుతుండడంతో స్థానిక ప్రాంతాలు మొత్తం పొగ మయంగా మారిపోయి.సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటల తరబడి మంటలు […]

డివైడర్‌ పైనుంచి దూకి బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్‌ పైనుంచి దూకి పక్క లేన్‌లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్‌ పైనుంచి జంప్‌ చేసింది. మరో లేన్‌లోకి దూసుకెళ్లింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును ఆ కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఉన్న ఐదుగురు యువకులు […]

భారత్, పాక్ ప్రతీసారి ఒకే గ్రూప్​లో ఎలా ఉంటాయి? ఇదంతా ముందే రాసిన స్క్రిప్టేనా? : మాజీ క్రికెటర్

1983 వరల్డ్ కప్ ప్లేయర్, ప్రస్తుత ఎంపీ కీర్తి ఆజాద్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి ఐసీసీ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. మిగతా దేశాలైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు రకరకాల గ్రూపుల్లోకి మారుతుంటాయని, కానీ ఇండియా, పాక్ మాత్రం ఎప్పుడూ విడిపోకుండా ఒకే చోట ఎలా ఉంటున్నాయని నిలదీశారు. “ఇది ఐసీసీ, బీసీసీఐ కలిసి చేస్తున్న ఫిక్సింగ్ కాదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

నూతన ప్రధానిగా ఎన్నికైన  తారిఖ్ రెహ్మాన్,  ఫిబ్రవరి 17న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రకటనలో పేర్కొంది.

ఇండియా- యూకే ట్రేడ్​ డీల్​ ఏప్రిల్​ నుంచే అమల్లోకి!

భారత్‌- బ్రిటన్‌ మధ్య గతేడాది జులైలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2026 ఏప్రిల్‌లో అమలు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫలితంగా భారత్‌ నుంచి వెళ్లే 99శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. అదేవిధంగా, భారత్​లో కార్లు, విస్కీ వంటి బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గనున్నాయి. 2025 జులై 24న సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA)పై భారత్​- యూకేలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్యం 34బిలియన్‌ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON